
MLA
గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్
పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు