
: World Photography Day Celebrations in Mahadevpur
ప్రపంచ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్ మహాదేవపూర్
ఆగష్టు 19 నేటి ధాత్రి *
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మహాదేవపూర్ యూనియన్ ఆధ్వర్యంలో
186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని
కెమెరా సృష్టికర్త ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే గారి చిత్రపటానికి పూలమాల వేసి డాక్టర్ మాధవిజ్యోతి ప్రజ్వలన చేసుకుని మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ని రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు
తదనంతరం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మేకల రాజేష్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల పెద్ద నరసింహస్వామి కోశాధికారి పెండ్యాల చిన్న నరసింహస్వామి ఉపాధ్యక్షుడు కావేరి సంతోష్ గౌరవ అధ్యక్షులు బుర్ర లింగయ్య గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, జయంత్ మరియు యూనియన్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు