
MLA Janampally Anirudh Reddy.
“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”
ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.
రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.
జడ్చర్ల నేటి ధాత్రి
రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.