
Two Youth Electrocuted While Shifting Ganesh Idol
అయ్యో దేవుడా
‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’
వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
హైదరాబాద్ ,నేటిధాత్రి:
హైదరాబాద్ రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.