
“ప్రజావాణికి 92 ఫిర్యాదులు.*
33 దరఖాస్తులు భూ సమస్యలపైనే..
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 33 దరఖాస్తులు భూ సమస్యలపైనే రావడం విశేషం. ఈ నేపద్యంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. 92 దరఖాస్తులలో రాగా అత్యధికంగా భూ సమస్యల పట్ల 33 వినతులు రాగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జిడబ్ల్యూఎంసీ)
18 దరఖాస్తులు,గృహ నిర్మాణ శాఖకు 9, వైద్య ఆరోగ్య,విద్య శాఖకు 4 చొప్పున వినతులు,ఇతర శాఖలకు సంబంధించినవి 24 ఫిర్యాదులు కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు ప్రజావాణిలో
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ వాతావరణ శాఖ జిల్లాకు ఆరేంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రోడ్లు,రవాణా,వైద్య ఆరోగ్య శాఖల జిల్లా అధికారులు శాఖల వారిగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకొని పరిస్థితుల కనుగుణంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి,డిఎఓ అనురాధ,డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,డిడబ్ల్యూఓ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఉమారాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.