
Sardaar Papanna Goud 375th Jayanthi in Parakala
పరకాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
నివాళులు అర్పించిన శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలొ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకకు ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మన తెలంగాణ ప్రాంతంలో ఒక సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకతాటిపై తెచ్చి ఆనాడు అరాచక పరిపాలన కొనసాగిస్తున్న మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన యొక్క స్నేహితులను,ప్రజలను చైతన్యవంతం చేసి ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని మొగల్ రాజులను తుది ముట్టించాదని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నడికూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,పరకాల రూరల్ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,ఎస్సి,ఎస్టీ సంఘాల జాతీయ నాయకులు సోదా రామకృష్ణ,మున్నూరు కాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జం రమేష్,మాజీ జడ్పీటీసీ పాడి కల్పన ప్రతాప్ రెడ్డి,ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడికొండ శ్రీనివాస్,కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,బండి రాణిసదానందం,పసుల లావణ్య రమేష్,గౌడ సంఘ నాయకులు బుర్ర రాజమౌళి గౌడ్,చిర్రా సతీష్ గౌడ్,రామూర్తి గౌడ్,మార్కా బిక్షపతి గౌడ్,హరీష్ గౌడ్ బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.