
Krishna Reddy
జాండీస్ వ్యాధిపై అధికారుల పర్యవేక్షణ
వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :
వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాధి వ్యాప్తి చెందడం పై అధికారులు గ్రామం లో పర్యటించారు వరంగల్ రిజీనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీ అధికారి కృష్ణారావు గ్రామంలో మంచి నీటి నమూనాలను తీసుకొన్నారు ల్యాబ్ లో పరిశోధన జరుపుతామని అన్నారు అదేవిదంగా జిల్లా వైద్యాధికారి వెంకట రమణ పర్యటించి బాధితుల వివరాలు సేకరించారు. వారం పాటు గ్రామం లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అరా తీశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.