
"Massive Devotee Turnout at Kailasagiri Shiva Temple"
కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జహీరాబాద్లో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు గణేష్ స్వామి, నందు స్వాముల ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం, బిల్వార్చన, గంగాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.