
New Ration Cards
కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహారెడ్డి పాల్గొన్నారు.అట్టి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి లోబడి నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. బలహీన వర్గాలకు ఏ స్కీమ్ వచ్చిన దానికి బేస్ రేషన్ కార్డు అవసరం ఉంటుందని ఇందిరమ్మ ఇండ్లు గాని గృహానికి ఉచిత కరెంటు గాని రాజీవ్ యువ శక్తి గాని సబ్సిడీ గ్యాస్ గాని ప్రతి ఒక్క దానికి అర్హులు తెల్ల రేషన్ కార్డు దారులే అని అన్నారు. గత ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీదలకు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందిస్తుందన్నారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చిన దొడ్డు బియ్యం తినేవారు కాదని అమ్ముకునేవారని అలా రీసైకిల్ అయి అదే బియ్యం మళ్లీమళ్లీ వచ్చి పోయేదని కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారుడు దాన్ని తింటున్నారని అన్నారు.
ప్రజలకు అవసరమయ్యే బియ్యాన్ని పండించేందుకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నందున రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం 200 యూనిట్ల వరకు పేదలకు కరెంట్ రైతులకు రుణమాఫీ అదేవిధంగా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటును ఇచ్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు బీదవాళ్ల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తుందన్నారు.ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్టి కాలంలో పూర్తి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ సి డి సి డైరెక్టర్ జి మల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ఇమాం పటేల్ మాజీ ఎంపిటిసి ఎస్ నరసింహులు మాజీ సర్పంచ్ ప్రతినిధి చెన్నారెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ నాయకులు చేస్మోదిన్
ఆరిఫుద్దీన్ షేక్ అలీ కుర్షిడ్ బయ్ నారాయణ గౌడ్ సైఫుద్దీన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.