
Donthi Madhav Reddy's
ఘనంగా దొంతి మాధవరెడ్డి జన్మదినవేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నర్సంపేట శాసనసభ్యులు అందరూ ముద్దుగా పిలుచుకుని బంగారు కడ్డీ మాధవరెడ్డి జన్మదినోత్సవాన్ని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ప్రతి ఊరు వాడలలో ఘనంగా దొంతి మాధవరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నిర్వహించుకున్నారు. నేడు ఎమ్మెల్యేగా నాడు పార్టీ నేతగా ఒకే మాదిరిగా కార్యకర్తలను చూసుకుంటూ ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అంటూ అందరిని కలుపుకొని అందరికీ ధైర్యంగా నిలబడే నేత దొంతి మాధవరెడ్డి అని టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. అనుకోకుండా జరిగిన అనుకొని జరిగిన ఒక మహానేత ఈ స్థాయికి రావడానికి కష్ట నష్టాలు ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడ్డ నేత దొంతి మాధవ రెడ్డి అని ఈరోజే యావత్ భారతదేశం గర్వించదగ్గ నేత సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కావడం ఒక విశేషంగా అంతటి మహోన్నతమైన స్థాయికి దొంతి మాధవరెడ్డి ఎదగాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్ అన్నారు. మాధవ రెడ్డి జన్మదిన రోజు సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల నేత జయంతి జగడం మాధవరెడ్డి అలాంటి విధంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని ఆశ భావాన్ని నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి వ్యక్తం చేశారు. శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ నేత రాచకొండ రఘు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, యువజన నాయకులు చల్లా శ్రీపాల్ రెడ్డి, మెరుగు విజయ్, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, ఈదునూరి ప్రభాకర్, కొల్లు వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.