
Heavy Rains Lash Medak and Sangareddy
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.