
"Farmers Seek Relief for Flooded Crops"
నీట మునిగిన రైతుల పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి
బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లో
అధిక వర్షాలతో గణపురం మండలంలో మోరంచవాగు ఉప్పొంగడంతో వాగు పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించి తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతు జిల్లాలో మరి కొద్ది రోజులు అధిక వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసిందని, ఇప్పటికే మోరంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని సీతారాంపూర్ ధర్మరావుపేట, గణపురం, చెల్పూర్ శివారులో వరద తాకిడికి గురై పంట పొలాలు నీట మునిగాయన్నారు. గత రెండు రోజులుగా వరి పంట నీటిలో మునిగి ఉండటం, పొలాల్లో ఇసుకమేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సర్వే చేపట్టి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అదే వి ధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫలస్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆ పథకాన్ని అమలు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.