
Panchamritabhishekam was performed for Moolavirat.
శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్సికోత్సవ వేడుకలు.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మంజూరు నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలను టిటిడి వేద పండితులు శ్రీ భావనారాయణ చార్యుల బృందం చేత ఘనంగా ప్రారంబించడం జరిగింది. మూలవిరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జెన్కో సి ఈ ప్రకాష్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు