
"Adivasi JAC Celebrates 79th Independence Day"
ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ.
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…
కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో గల కొమరం భీమ్ సెంటర్ యందు ఆదివాసి సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) కరకగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ జాతీయ పతకం ఆవిష్కరించి 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మగ్గిపోయిన భారతీయుల జీవితాలకు 15 ఆగస్టు 1947న బ్రిటిష్ బానిస సంకెళ్ళను తెంచి భారతీయ పౌరులందరికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించుటకు ఎందరో మహానుభావులు మహనీయులు ప్రాణ త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని కొనియాడారు. ఇప్పుడే కాదు ఎప్పుడు వారి త్యాగాలను మరవకుడదు వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ యువత ముందుండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు వారి స్వలాభం కోసం పోరాటం చేయలేదు దేశంలోని పౌరులందరూ స్వతంత్ర భారతదేశంలో సగౌరవంగా జీవించుటకు, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో మెలగాలని, ప్రతి ఒక్కరి హక్కులు హరించకుండా వారి వారి హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మహనీయులైనటువంటి మాహత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాంటి వారు ఎందరో మహనీయులు స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించి మనకోసం స్వాతంత్ర తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడున్న సమాజంలో స్వచ్చ, సమానత్వం, సోదర భావం కరువైయ్యాయాని వారి ప్రాణ త్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఇప్పటి నుంచి అయినా యువత ఆయొక్క మహనీయుల ఆశయాలకై పని చేయాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు పోలేబోయిన సర్వేష్, కొమరం శంకర్, కలం సంపత్, ఊకె నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, ఆదివాసీ ఉద్యోగులు కొమరం అశోక్, పూనెం శంకర్, ఆదివాసీ సీనియర్ నాయకులు కొరగట్ల నరసింహారావు, గోగ్గల నరేష్, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.