
79th Independence Day celebrations in full swing.
ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
శ్రీరాంపూర్,నేటి ధాత్రి :
79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.అధ్యక్షులు చెల్ల విక్రమ్ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు స్వీట్స్ పంచిపెట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల బ్రతుకులు మారలేదని అన్నారు.ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోలేటి శివ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.