
Mega Medical Camp at Srirampur PHC..
మెగా మెడికల్ క్యాంప్
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు