
Telugu Rajasekhar,
ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసిన ఐటిఐ విద్యార్థి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామానికి చెందిన తెలుగు రాజశేఖర్ అనే విద్యార్థి ఐటిఐ డీజిల్ మెకానిక్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత, ఇటీవల తన తండ్రి నరసింహులు సహాయంతో జీప్ నమూనా తో కూడిన నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసిన ఈ ఐటిఐ విద్యార్థిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.