
government
కోనాపూర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రజల్లో ఆనందం..
రామాయంపేట ఆగస్టు 13 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్డు లేని నిరుపేదలకు, కొత్తగా పెళ్లయిన వారికి, పుట్టిన పిల్లల పేర్లతో సహా లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశారు.
గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారందరికీ ఈ సదుపాయం లభించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి సిద్ధిరాములు, గ్రామ అధ్యక్షులు గడ్డం సురేష్, గ్రామ యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, మంద నర్సింలు, డీలర్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.