
Narshamukta Bharat Abhiyan
ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నషముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ టీ మైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్బంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు సరైన మార్గంలో పయనించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎవరైనా అమ్మకం కొనుగోలు చేసిన మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎండి.సర్దార్ స్టాప్ సెక్రటరీ కృష్ణమోహన్,అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.