
CCTV cameras
సోలార్ లైట్ బ్యాటరీల చోరీ.
#సుమారు రూ.20 వేల విలువల బ్యాటరీలు
#పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పంచాయితీ సెక్రటరీ.
#సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు జరిగుండేవి కావు..గ్రామస్తులు
నర్సంపేట,నేటిధాత్రి:
రోడ్డుపై ఉన్న సోలార్ విద్యుత్ స్తంభం బ్యాటరీలు చోరికి గురైన సంఘటన నర్సంపేట మండలంలోని బాంజిపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.గ్రామస్తులు,గ్రామ పంచాయితీ సెక్రటరీ స్నేహాలత తెలిపిన వివరాల ప్రకారం బాంజిపేట గ్రామంలో ప్రధాన కూడలి బొడ్రాయి వద్ద గల సోలార్ లైట్ విద్యుత్ స్తంభంకు ఉన్న సుమారు 20 వేల రూపాయల విలువ గల రెండు బ్యాటరీలను స్తంభం బాక్సులు ధ్వంసం చేసి దొంగతనం చేశారని తెలిపారు.దొంగతనం పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని కార్యదర్శి స్నేహాలత పేర్కొన్నారు.
సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు జరిగుండేవి కావు…
గ్రామంలో అన్ని ప్రాంతాల్లో సీసి కెమెరాలు ఉంటే దొంగతనానికి పాల్పడిన వారిని సులభంగా గుర్తించవచ్చునని గ్రామస్తులు తెలిపారు.అలాగే మున్ముందు చోరీలకు పాల్పడ్డాలన్న దొంగలకు బాయం ఉంటుందని దీంతో చోరీలకు
చెక్ పెట్టవచ్చని వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ అధికారుల చొరువతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.అలాగే గ్రామంలో సోలార్ విద్యుత్ స్తంభం బ్యాటరీలను దొంగతనం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను విన్నవించారు.