CCTV cameras
చుక్కాపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు. విరాళం
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని చుక్కాపూర్ గ్రామంలో సీ సీ కెమెరాలు ఏర్పాటుకు చేయుటకు ముందుకు వచ్చిన ఏమి రెడ్డి కు టుంబ సభ్యులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక దొంగతనాలు, దోపిడీలు, ప్రమాదాలను* పసిగట్టి దోషులను దొరకబట్టేందుకు ఎంతగానో ఉపయోగపడే సిసి కెమెరాలను గ్రామంలో ఏర్పాటు చేసేందుకు చుక్కాపూర్ గ్రామానికి చెందిన గౌరీ జువెలర్స్ ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఎన్ ఆర్ డెవలపర్స్ ఏమి రెడ్డి పాండురంగారెడ్డి వాళ్ల తల్లిదండ్రులు కీర్తిశేషులు, ఏమిరెడ్డి సుదర్శనమ్మ అల్వాల్ రెడ్డీ, ఏమి రెడ్డి భారతమ్మ మాధవరెడ్డి జ్ఞాపకార్థంగా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సిసి కెమెరాలు ఏర్పాటు చేయుటకు ముందుకు రావడం ఇట్టి సీసీ కెమెరాల ఏర్పాటుకు కావాల్సిన మొత్తం రూపాయలు₹1,30,000/- అక్షరాల ఒక లక్ష ముపై వేల రూపాయలను సోమవారం రోజున కె. శేఖర్ ఎస్సై గారికి సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం అందించారు. దాంతో ఎస్సై వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, సీసీ కెమెరాల కానిస్టేబుల్ జాషువా, కానిస్టేబుల్స్ భాను ప్రకాష్, శివుడు, చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసటీరి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, రేషన్ డీలర్ తిరుపతిరెడ్డి, దిశ రిపోర్టర్ చంద్రకుమార్, యూత్ సభ్యులు కడారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
