
Illegally transported
అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లింగసాన్ పల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక టిప్పర్లను ఆపి పోలీసులకు,తహసీల్దార్ కు సమాచారం ఇచ్చి 2 గంటలైనా ఇంతవరకు ఒక్కరుకూడా రాలేదని గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.కల్వకుర్తి మండలం దుందుభి వాగునుంచి అక్రమంగా రోజుకు వంద లారీలకు పైగా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా చూసి చూడనట్లు ఆదికారులు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారని, పర్మిషన్ ఉంటే రాత్రి పూట ఇసుకను ఎందుకు తరలిస్తారని, ఒకటి రెండు లారీల కు పర్మిషన్ తీసుకుని వంద లారీలు తరలిస్తున్నారని తెలియజేస్తున్నారు. సెలవు దినాల్లో మరీ ఎక్కువ టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో టిప్పర్ లు వరుసపెట్టి ఇసుకను తరలిస్తుంటే గ్రామ యువకులం కలిసి టిప్పర్ లను ఆపి పోలీసులకు,తహసీల్దార్ కు ఫోన్ చేసి రెండు గంటలకు పైగా అయినా స్పందించడం లేదని వాపోతున్నారు.విచ్చల విడిగా టిప్పర్ లు నడుస్తుండడం వల్ల రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని, రాత్రిళ్ళు రోడ్డుపైకి రావాలంటే భయ మేస్తుందని అందుకే ఆదివారం అధికారులు స్పందించక పోవడంతో మీడియాకు సమాచారం ఇచ్చామని గ్రామస్తులు,యువకులు తెలిపారు.