
Chennai Grandmasters Chess.
అర్జున్ రెండో విజయం
స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్ కేటగిరిలో తొలిరౌండ్ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం…
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్
చెన్నై: స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్ కేటగిరిలో తొలిరౌండ్ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం సాధించాడు. ఈ రౌండ్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్‌ను ఓడించాడు. మూడు రౌండ్ల అనంతరం అర్జున్ 2.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన జర్మనీ నెంబర్‌వన్ విన్సెంట్ కేమర్ 3 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లలో అనీష్ గిరి (1.5)తో గేమ్‌ను ప్రణవ్ (1) డ్రా చేసుకోగా, నిహాల్ సరీన్ (0.5)పై విదిత్ గుజరాతీ (1.5) గెలిచాడు. చాలెంజర్స్ కేటగిరి మూడో రౌండ్లో అధిబన్‌తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించగా, ల్యూక్ మెన్డోన్సా చేతిలో వైశాలి ఓటమిపాలైంది. వైశాలి (1) ఏడు, హారిక (0.5) తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.