
Heavy rains
దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం
నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు
హైదారబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలాగే నగరంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే..