
Dr. SridharLakshmi Colony.
డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో లక్ష్మీ కాలనీ గ్రామంలో వైద్యశిబిరం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల పరిధిలో లక్ష్మీ కాలనీ గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరంగా నిర్ధారణ అవ్వటంతో వైద్యం అందించడం జరిగినది ఈ ఆరోగ్య శిభిరంలో
47 మంది ప్రజలకు వైద్య సేవలు అందించారు
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
అందరూ ఫ్రైడే డ్రైడే పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు పెరిగే అవకాశం ఉండదనీ తెలిపారు
రాత్రి వేళలో నిద్రించేటప్పుడు అందరూ దోమతెరలు వాడాలని తెలియజేశారు
నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మొబైల్ డాక్టర్ సచిన్ ఆర్ బిఎస్కే వైద్యురాలు డాక్టర్ స్పూర్తి హెల్త్ సూపర్వైజర్ రామ్ ప్రసాద్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శిరీష మొబైల్ నర్సింగ్ ఆఫీసర్ దీక్షిత హెల్త్ అసిస్టెంట్ స్వరూప రాణి ఆర్బిఎస్కే స్టాఫ్ నర్స్ దుర్గ సార్బి ఎస్ కే ఎన్ ఎం భారతి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు