
Raksha Bandhan program
బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని రామాలయం పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రం,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.నర్సంపేట బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు జ్యోతి బెహన్,నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు విడిపిఓ మధురిమ హాజరై మాట్లాడుతూ సోదర భావాలను పెంపొందించే ఈ రక్షాబంధన్ కార్యక్రమం పిల్లలతో నిర్వహించడం వలన ప్రేమ,స్నేహం,సౌభ్రాతృత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు.శాంతియుత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో ధ్యానం చేయించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ వీరలింగం, సుభద్ర, ఐసీడీఎస్ స్థానిక సూపర్ వైజర్ రమ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు,పద్మ, స్థానిక అంగన్వాడి టీచర్ నల్లభారతి, గౌసియా, ఆయా సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.