
Congress government
పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…
జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…
హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.