
Collector Satya Sharada Devi.
తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ సత్య శారద దేవి
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.
నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం
మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.