
Congress party
బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే.
బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాల్సిందే.
రిజర్వేషన్ పెంపునకు పోరాటం చేస్తాం.
ఎమ్మెల్యేలు.. జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్ /నేటి ధాత్రి.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో.. చేపట్టిన పోరు బాట మహాధర్నాలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా..
బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టో లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామి ఇచ్చామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేయించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వారితో చర్చించి, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి, బీసీలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి , అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించామని , కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా, వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్నా రిజర్వేషన్లు అవసరమని ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.