
Ramayampet
రామాయంపేటలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నాల్గవ వార్డ్ లో ఆర్డీఓ రమాదేవి పర్యవేక్షణ..
రామాయంపేట,నేటి ధాత్రి (మెదక్)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక శుభ్రత కార్యక్రమం (సానిటేషన్ స్పెషల్ డ్రైవ్) లో భాగంగా ఈరోజు నాలుగవ వార్డులో కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీమతి రమాదేవి, తహసిల్దార్ టి. రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్ లు వార్డులో పర్యటించారు. వారు మురికి కాలువల శుభ్రత, మిషన్ భగీరథ నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, దోమల నివారణకు చేపడుతున్న ఫాగింగ్ కార్యకలాపాలు, పచ్చదనం మరియు పరిశుభ్రతపై అధికారుల చర్యలను పరిశీలించారు.
పనుల్లో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చూపకుండా, సమర్థవంతంగా చేపట్టాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.