
Atya Patysa Selection
ఠాగూర్ స్టేడియంలో ఆత్యా పాత్య సెలక్షన్స్ పోటీలు…
పోటీలు ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా స్థాయి అండర్ 15 అమ్మాయిల, అబ్బాయిల ఆత్యా పాత్యా పోటీల సెలక్షన్స్ రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బుదవారం జరిగాయి. సెలక్షన్స్ పోటీలను జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఉపాధ్యక్షులు దేవేందర్, సంతోష్ ,జిల్లా సెక్రటరీ పెద్దపల్లి ఉప్పలయ్య,ట్రెసరర్ దొంతుల వర్ష, నేషనల్ రెఫరీ విశాల, జాతీయ స్థాయి క్రీడాకారులు పాగే రాము, శ్రీ వల్లి, పీ,డీ మల్లిక, పి,ఈ,టి లు సానియా, రఘు లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల బాయ్స్, మందమర్రి కస్తూరిబా పాఠశాల అమ్మాయిలు, మంచిర్యాల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ అబ్బాయిలు, రామకృష్ణాపూర్ గురుకుల విద్యార్థినులు పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఐదుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను సెలక్షన్ చేస్తామని అన్నారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 10న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల సెలక్షన్స్ లో పాల్గొంటారని తెలిపారు.