
Anganwadi center..
కోహిర్ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు నిరుపయోగంగా మిగిలిన భవనాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: కోహీర్ మండల కేంద్రంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాల భవనాలు సౌకర్యాల కొరతతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. సొంత భవనాలు సిద్దంగా ఉన్నప్పటికీ అవసరమైన మౌళిక సదుపాయాలు, రిపేర్లు పూర్తి కాకపోవడంతో ఈ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కోహిర్ మండలంలోని బీమ్నగర్ కాలనీలోని ఒక అంగన్వాడీ దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన ప్పటికీ విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో ఉపయోగం లోకి రాలేదు. ఫలితంగా అంగన్వాడీసిబ్బంది సంకుచితమైన వెంటిలేషన్ లేని అద్దె భవనాల్లో పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితి సిబ్బంది, పిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. స్థానికులు తమ ఆవే దన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించిన వాటిని వినియోగించకపో వడం వల్ల నిధులు వృథా అవుతున్నాయి. వెంటనే సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ కేంద్రాలను సొంత భవ నాల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులను సంప్రదించగా, సౌకర్యాల ఏర్పా టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలను సొంత భవనాల్లోకి మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే గతంలో ఇలాంటి హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో ఎటువంటి పురోగతి లేకపో వడంతో స్థానికులు నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నిర్మించిన భవనాలను వినియో గింలోకి తేవాలని, తద్వారా పిల్లలకు మెరుగైన సౌకర్యాలతో అంగన్వాడీ సేవలు అందుబాటులోకి రావా లని స్థానికులు కోరుతున్నారు.