
Kasturba Gandhi Vidyalaya.
కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
అస్వస్థతకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.
ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
నాణ్యత లేని కూరగాయలు, ఫుడ్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.
:- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం లో పురుగుల అన్నం తిని వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పితో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారు.
కస్తూర్భా గాంధీ కళాశాలలో కలుషితమైన ఆహారం తిని 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి విద్యార్థుల పరిస్థితి విషమించటంతో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికీ చికిత్స అందించడం జరిగింది.
నేను గత శుక్రవారం రోజున ఇదే కస్తూర్భా స్కూల్ సందర్శించడం జరిగింది.
ఆ రోజు కుళ్ళిపోయిన కూరగాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్లకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి కూడా ఫుడ్ పెట్టడం లేదు, పప్పు ఒక చెంచా,ఉల్లిగడ్డ పులుసు చేసి పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కూర తక్కువ కలుపుకుని తింటా ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్లకు క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది.ఆ రోజు మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈ ఈ స్కూల్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడకు రావడం జరిగింది, వారికీ కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా విద్యార్థులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను తెలుసుకొని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యావ్యవస్థ సక్రమంగా నడిచేలా మీరు స్పెషలాఫీసర్ దృష్టి పెట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్నోక్కటే రోజు మూడు స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు. మొన్నటి రోజున విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి తమ సమస్యలు చెప్పుకునే స్థితిని చూస్తే మరి ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉన్నది.
మేము కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు కార్యక్రమాన్ని మేము చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారు. నేను రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు.
ఈ రోజు విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని, ఈరోజు మీకు అర్థమైంది.
కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణి లో ఉన్నాయి. మరీ జిల్లా జనరల్ అసుపత్రిలోని కింది స్టాప్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయం తోటి నియమించబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కో ఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తి కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నట్టువంటి పరిణామాలను మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలని, ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము, మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అని భయపడుతున్నారు.
కాబట్టి మీరే పిల్లలు నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలియజేస్తూ.
ఇప్పటికైనా స్పెషల్ కమిటీ నియమించి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాలపై దృష్టి పెట్టాలనికోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు