
Telangana BJP
బిజెపి తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో కేంద్రంలో మహా సంపర్క అభియాన్ లో భాగంగా ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు నవీన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి
ముందుగా కోటగుళ్లు లోని భవాని సహిత గన పేశ్వరాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమం ప్రారంభించింది ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి డోర్ స్టిక్కర్ వేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రతి ఇంటికీ పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమం గ్రామ స్థాయిలో బీజేపీ బలాన్ని పెంపొందించేందుకు తీసుకున్న ఒక కార్యాచరణ. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, బీజేపీ పాలన విశేషాలను తెలియజేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. మోడీ గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎన్నో ప్రజానుకూల పథకాలను ప్రవేశపెట్టారు ఉజ్వలా యోజన గ్యాస్ కనెక్షన్ల ద్వారా లక్షలాది మహిళలు వంటగదిలో పొగలు లేకుండా జీవించగలుగుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే జాతీయ ఆరోగ్య పథకం ద్వారా పేదలకు భారీ ఊరట.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారు.
హర ఘర్ నలే జల్ ప్రతి ఇంటికి శుద్ధ నీటి కనెక్షన్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం.
సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రంతో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తున్నారు.
పిఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 నేరుగా ఖాతాల్లో జమ చేయబడుతోంది.
ఇంటర్నెట్ కనెక్షన్, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా వేగంగా కొనసాగుతోంది.ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో అననివార్యంగా ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ తీసుకున్న సమర్థవంతమైన నిర్ణయాలు. కాంగ్రెస్ గారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తే, మోదీ గ్యారంటీతో మేలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అభివృద్ధి లోపం, హామీల విఫలం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల్లో అమలు చేయని హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ వంటివి ఇవన్నీ తుపాకి లాంటి వాగ్దానాలు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుల, వర్గ రాజకీయాలు ప్రోత్సహించి, సామరస్యాన్ని దెబ్బతీశారు. కుటుంబ పాలనపై ఆధారపడి యువత, సామాన్య కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పాలి, కాంగ్రెస్ మోసాలను బహిరంగపర్చాలి, బీజేపీ అభివృద్ధిని చూపించాలి. బీజేపీ అనేది కేవలం నినాదం కాదు ప్రజల నమ్మకానికి ప్రతీక. మోడీ పాలనను గుర్తించి, ప్రజల ఆశయాలను నెరవేర్చే పార్టీగా బీజేపీని నిలబెట్టే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి రాష్ట్ర నాయకులు దుప్పటి భద్రయ్య బీజేవైఎం రాష్ట్ర కళాశాల విభాగం కన్వీనర్ మంద మహేష్ మండల సీనియర్ నాయకులు సోమ దామోదర్ పున్నమి చందర్ మల్లన్న రాణి మేకల సమ్మయ్యగుండా సంపత్ మండల ఉపాధ్యక్షులుమాదాసు మొగిలి కుక్కముడి రమేష్ బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ భూక్య హరిలాల్ దూడపాక సతీష్ రేపాక సంతోష్ దేవనూరు భార్గవ్