
Progressive Teachers Federation
జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ధర్నాకు ఉపాధ్యాయులు ఉద్యమ కెరటాలై కదలాలి.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 5న ధర్నా
విద్య రంగా, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ మూడు దశల్లో పోరాటాన్ని ఎంచుకున్న కమిటీ.
నేడు రెండో దశ పోరాటంలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ధర్నా.
మనకోసం మనం చేసే ఈ పోరాటంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి
విద్యారంగంలో పేరుకుపోయిన అనేక విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రోసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపునిచ్చారు.
కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కరపత్రాలను టి పి టి ఎఫ్ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని, పిఆర్సీ అమలు చేయాలని,డిఏలు ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయడం లాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని, సత్వరమే పరిష్కరించాలని సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా గాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినప్పుడే సమస్య పరిష్కారం కోరుతూ సంఘాలు చివరి అస్త్రంగా ధర్నాలు నిర్వహిస్తాయని,ఆ సమయంలో మన ఉపాధ్యాయ బలం చూపించుకోలేకపోతే ఈ సమస్యలు ఎన్నటికీ కూడా పరిష్కరించబడవని సూచించారు. సంఘాలు నిర్వహించే ధర్నాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తీసుకుంటుందని వివరించారు. ధర్నాలలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొంటే సమస్యల తీవ్రతను గుర్తించి మన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరిస్తాయని, ఒకవేళ ధర్నాలు విజయవంతం కాకుంటే ప్రభుత్వం మన సమస్యలను పట్టించుకోదని , ఎన్నటికీ పరిష్కరింపబడవని ఉపాధ్యాయులను హెచ్చరించారు.
మన కోసం మనం చేసే ఈ పోరాటంలో అందరూ తప్పక పాల్గొనాల్సిందేనని అది మన గురుతర బాధ్యత అని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వం కూడా ఇంకా మొండిగా వ్యవహరిచొద్దని ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, సభ్యులు అప్పాల నాగరాజు, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.