
సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి విజిలెన్స్ పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కరించారు
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ వెంటనే పరిష్కరించాలని. ఏఐఎఫ్ టియు
రాష్ట్ర . నాయకులు చంద్రగిరి శంకర్ .డిమాండ్ చేయడం జరిగింది.
సింగరేణి సంస్థల్లో గత కొన్ని దశాబ్దాల నుండి మారుపేర్ల మీద పని చేస్తున్న వేలాది మందికి తమ
పేర్లను మార్చుకునే అవకాశం కల్పించడంలో సింగరేణి యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నోసార్లు మారు పేర్ల సమస్యను యజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దాటవేత్త ధోరణి అవలంబిస్తూ ఎప్పటికప్పుడు విషయాలను
పక్కదారి పట్టిస్తుందని . తండ్రి ఉద్యోగాలు రాక. ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించక కుటుంబాల పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
గత కెసిఆర్ ప్రభుత్వం మారు పేర్లల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పరిష్కరించలేకపోయింది
ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మారు పేర్లను పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పరిష్కరించలేకపోయింది
సమస్యల పరిష్కారం కోసం మారుపేర్ల బాధిత కుటుంబాలు శాంతియుతంగా సింగరేణి వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ. సింగరేణి ఏరియా ల అధికారులకు. మరియు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు . సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాల నాయకులకు మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రములు ఇస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అయినా ప్రయోజనం లేకపోవడంతో మా తండ్రి ఉద్యోగాలు మాకు రావని మనస్థాపానికి గురై ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది
అయినా పరిష్కారం లేకపోయింది ఇప్పటికైనా. హామీ ఇచ్చి గెలిచినగ సంఘాలు.. సింగరేణి యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవత్వ కోణంలో ఆలోచించి
మారుపేర్ల బాధిత కుటుంబాలను ఆత్మహత్యల నుండి కాపాడాలని వెంటనే విజిలెన్స్ లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఏఐఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది