
Collector
కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని.సందర్శించిన కలెక్టర్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సోమవారం, 04 జూలై 2025న కరకగూడెం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సందర్శించారు. కలెక్టర్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులతో సంభాషించి సామర్థ్యాలను పరిశీలించారు. బోధన విధానం, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల పాఠన శైలి తదితర అంశాలపై ఆయన వివరంగా తెలుసుకున్నారు.
కలెక్టర్ పాఠశాలలోని భోజనాల గది, వసతి గదులు, ఫర్నిచర్, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డి. శ్రీదేవి పిలిపించి, వసతి, ఆరోగ్య పరిరక్షణ, టాయిలెట్లు, నీటి వసతి, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేగాక, కరకగూడెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నవోదయ పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు. అక్కడి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించి త్వరలోనే పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల తహసీల్దార్ గంట ప్రతాప్ , డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతారావు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ *పి. కృష్ణ ప్రసాద్ , ఎఇ శ్రీనివాస్ , ఎంపీడీవో మారుతి యాదవ్ గ్రామ సెక్రటరీ రామకృష్ణ ,మరియు తదితరులు పాల్గొన్నారు.