
demolished the house
అయ్యో పాపం.. పేదల ఇళ్లు కూలగొట్టిండ్లు..
పోగుల ఆగయ్య నగర్లో ఇంటి నంబరు ఉన్న ఇల్లును కూల్చిన అధికారులు?
ఇండ్ల కూల్చివేతతో సర్వం కోల్పోయామని బాధితుల ఆవేదన.
తీన్మార్ మల్లన్నను కలిసిన గుడిసవాసులు.
కబ్జాదారుడు “మోతీలాల్” కోసం తమ ఇండ్లను కూల్చి వేశారని ఫిర్యాదు.
న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విన్నపం.
నేటిధాత్రి, వరంగల్.
గ్రేటర్ వరంగల్ శివారు, పోగుల ఆగయ్య నగర్లో గత 16 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను నాలుగు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ప్రజా సంఘాల నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్, మాదాసి సురేష్ లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ పాలనలో పేదలకు అన్యాయం జరగడం సరికాదని వారు అన్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, గ్రేటర్ వరంగల్ నగర శివారు పోగుల ఆగయ్య నగర్లో గత పదహారు యేండ్ల క్రితం పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలో, పోలీసులు, మున్సిపల్ అధికారులు అకారణంగా జెసిబి లతో గుడిసెలు నేలమట్టం చేసిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాజేందర్, ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, మాజీ సర్పంచ్ రమేష్, రాష్ట్ర నాయకులు సునీత, కుమార్లు ఇల్లు కూల్చిన స్థలంలో
బాధితులు కలమ్మ, రేణుకలతో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను, ఇందిరమ్మ ప్రజా పాలనలో అన్యాయంగా కూల్చివేయడంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఇండ్లు కులగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.