
State Assembly Speaker Gaddam Prasad.
అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు.
◆:- అభినందనీయుడు శిల్పి బస్వరాజ్:
◆:- రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్,
◆:- అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, పట్లూరు, వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా పట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు.
ఈ విగ్రహం రూపొందించిన శిల్పిహెూతి బస్వరాజ్ను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి కళాఖండాల రూపంలో వన్నెతరం తీసుకొచ్చిన బస్వరాజ్ అభినందనీయుడని ప్రశంసించారు. అంబేద్కర్ విగ్రహం రాష్ట్రంలో మూడవ అతిపెద్ద విగ్రహంగా ఉండటం విశేషంగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన బస్వరాజ్ ఇప్పటికే దేశంలోని అనేక మహనీయుల విగ్రహాలను శిల్పంగా ఆవిష్కరించిన ఘనత รอก న్నారు. మహాత్మా బనవేశ్వరుడు, శివాజీ, స్వామి వివేకానంద, భక్త రామదాసు, భగత్ సింగ్, రాణా ప్రతాప్, గౌతమ బుద్ధుడు, కొమరం భీమ్, మదర్ థెరిసా, చాకలి ఐలమ్మ, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ తదితరుల విగ్రహాలను తయారు చేసిన కృషి ఆయన్ను ప్రత్యేక వ్యక్తిగా నిలిపిందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్వరాజ్న పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు రెడ్డి, ఎలికట్ట రాజు, విజయ్, కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.