
ఆరోగ్యమే మహా భాగ్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
కోర్టులో పనిచేసే న్యాయవాదులు, ఉద్యోగులు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తిగారు మాట్లాడుతూ ఆధునిక యుగంలో బిజీ జీవితాలను గడుపుతున్న తరుణంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. బి.పి, షుగర్, ఈ.సి.జి కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రవణ్ రావు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనితావని మేడికవర్ హాస్పిటల్, శరత్ కంటి హాస్పిటల్ డాక్టర్లు వారి సిబ్బంది, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కాన్స్టేబుళ్లు పాల్గొన్నారు.