
School Principal P. Saritha.
రాష్ట్రస్థాయిలో పోటీలలో మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థులు *
మహాదేవపూర్ ఆగస్టు2 (నేటి ధాత్రి )
మహదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి,పందుల గణేష్ ఎనిమిదవ తరగతి, 11 తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జేఎన్ఎస్ స్టేడియం హనుమకొండలో ఈనెల మూడు, నాలుగవ తేదీలలో జరుగుతున్న అథ్లెటిక్ ట్రయట్లాన్ విభాగంలో పాల్గొంటున్నారని ఆ పాఠశాల పిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. సరిత మాట్లాడుతూ మా విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రస్థాయిలో పాల్గొని మన పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.