
స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గుడ్డెలుగులపల్లి గ్రామంలో 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధిని తుంగలో తొక్కి అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసి ప్రజలను పట్టించుకోలేదని నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ మండల పార్టీ నిత్యం ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రసిడెంట్ ఓలిగే నర్సింగరావు, గ్రామ క్లస్టర్ ఇంచార్జ్ బొల్లాపెల్లి రాము గౌడ్ ,క్లస్టర్ ఇంచార్జ్ మట్ట రాజు యాదవ్, మండల కార్యదర్శి అమ్మ రోహిత్,ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్,కోశాధికారి జంగిలి రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు జంగిలి నగేష్, మండల యూత్ నాయకులు తోరూరి రవి, గుండకారి సునీల్,కొలుగూరి సుమంత్,గ్రామ నాయకులు రమేష్, నరసయ్య, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.