
MLA Padma Devender Reddy
రామాలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించడం దారుణం..
ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే..
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..
రామయంపేట ఆగస్టు 2 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ రామాలయాన్ని ఎండోమెంట్‌కు అప్పగించడం దారుణమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా లేనివిధంగా ఎండోమెంట్‌కు అప్పగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అన్నారు.
ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా రామాలయాన్ని ఎందుకు ఎండోమెంట్‌కు ఇచ్చారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయంలో పోరాటం చేస్తామని అన్నారు. ఎండోమెంట్లో కలిపే పరిస్థితి వస్తే ముందస్తుగా ప్రకటన చేసి అభిప్రాయాలు తీసుకోవాల్సింది పోయి ఎవరికి తెలియకుండా ఎండోమెంట్లో కలపడం సమంజసం కాదన్నారు.