
Ramasahayam Mahipal Reddy
1,95,000 రూతో పాఠశాలకు 30 బెంచీలు బహుకరణ.
గ్రామ యువ నాయకులు రామసహాయం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులకు తరగతి గదిలో కింద కూర్చొని విద్యాభ్యాసన చేస్తున్న విద్యార్థుల సమస్య ను గుర్తించి రాంపురం గ్రామవాసి ఐనా తెలంగాణ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ రామసాయం అశోక్ రెడ్డి,తనయుడు రీజినల్ కమిషనర్ ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ 2 కమిషనర్ చెన్నై.రామసహాయం వివేక్ రామన్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు 1,95,000 రూతో 30 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులే,బావి తరానికి భవిష్యత్తు అని,విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాఅవకాశాలు తెచ్చుకోవాలని కొన్నిఆడారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న నా వంతు సహాయ సహకారం చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఏల్ది మల్లయ్య గౌడ్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.