
State Committee Member P. Venkata Ratnam
ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
11న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకట రత్నం పిలుపు
తిరుపతి(నేటి ధాత్రి) ఆగస్ట్ 01:
స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు బరితెగిస్తున్నాయని వెంటనే వీటిని రద్దు చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం పిలుపునిచ్చారు.ఈనెల 11వ తేదీన తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండి కార్యాలయ వద్ద
స్మార్ట్ మీటర్ల రద్దుకు జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అదానీ కంపెనీ రెండు కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు పాత మీటర్లు తొలగించి కొత్తగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రకు ఇది ముందడుగు అన్నారు. ఇకపై ప్రజలు ముందుగానే డబ్బు చెల్లించి కరెంటును కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల దేశంలో బడా కంపెనీలకు 23 లక్షల కోట్లు అడ్వాన్స్ గా చేరుతాయన్నారు. సింగిల్ ఫేస్ కు రూ.9000, త్రీ పేస్ కు రూ.17000 లను 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో ప్రజల నుండి వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. వైర్లెస్ టెక్నాలజీ ద్వారా అదానీ కార్యాలయం నుండి మన ఇంటి మీటర్‌ను ఆపరేట్ చేయడం జరుగుతుందన్నారు.ఈ బిల్లుల్లో తప్పులకు సమాధానం చెప్పేవారు ఉండరని,10 సంవత్సరాల పాటు మీటర్ల నిర్వహణ కాంట్రాక్ట్ ను అదానీ కంపెనీకి అప్పగించడంతో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు స్వీకరించినట్లు అయిందన్నారు.ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా ఆదాన్ని స్మార్ట్ మీటర్లు ఆపాలని, పెట్టిన మీటర్లను తొలగించాలని, ఇంధన సర్దుబాటు చార్జీల విధానమే తొలగించాలని, ఇప్పటివరకు వసూలు చేసిన సర్దుబాటు చార్జీలను ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ11న జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలోతిరుపతి నగర ఆటో వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ అలాగే నాయకులు మణి.
రవి.హరి, రాంబాబు. చిరంజీవి. బాబు. బాలకృష్ణ. మధు, శ్రీనివాసులు. అభిరామ్, ఉదయ్. మోహిత్. రాఘవేంద్ర. వేమయ్య తదితరులు పాల్గొన్నారు.