
సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక
కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా
పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున పట్టణంలోని ఎఫ్‌జె గార్డెన్లో హనుమకొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కళాకారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయా మండలాల నుంచి హాజరైన వారితో హన్మకొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సకల కళల పరిరక్షణ జేఏసీ హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా, ప్రధాన కార్యదర్శిగా దండు సారంగపాణిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహమ్మద్ అక్బర్ తెలిపారు.సకల కళల పరిరక్షణ జేఏసీ ఉపాధ్యక్షులుగా మల్లయ్య , బాబురావు,బుచ్చయ్య,సహాయ కార్యదర్శులుగా, రమేష్,సమ్మయ్య రాజయ్యాలను ఎన్నుకున్నారు.కోశాధికారిగా కొండ సమ్మయ్య,ప్రచార కార్యదర్శిగా బొందయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోగా 9 మందిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అక్బర్ పాషా,దండు సారంగపాణిలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు.