
ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుప్పటి మొగిలి మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జీలు చిలువేరు సంపత్ మాదిగ కో ఇన్చార్జి మేకల రవి మాదిగ ముఖ్య అతిథులుగా వచ్చి మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెరగాలని తేదీ 7 8 2025 రోజున హనుమకొండలో జరగబోవు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మండల నూతన కమిటీ కన్వీనర్ గా సంగాల సుమన్ మాదిగ, కోకన్వీనర్ గా దుప్పటి ప్రవీణ్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మొగిళి మాదిగ, సురేందర్ మాదిగ,రాజయ్య మాదిగ,దేవమని మాదిగ, సుమన్ మాదిగ,మోహన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.