
Congress party legal cell.
ఢిల్లీకి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింగ్వి ఆగస్టు 2 న రాజ్యాంగ సవాళ్లపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు సీనియర్ న్యాయవాది వర్ధన్నపేట పిసిసి అధికార ప్రతినిధి టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు మూదాసిర్ అహ్మద్ ఖయ్యూం, పోషిని రవీందర్, కొక్కొండ రమేష్, వెంకటరమణ, మహమ్మద్ జావేద్, గడ్డం విష్ణువర్ధన్ గార్లు శుక్రవారం రోజు సాయంత్రం ఢిల్లీకి జిల్లా కోర్టు ఆవరణం నుండి బయలు దేరి వెళ్ళారు.