
Pochamma Thalli temple,
ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ మందిరం నుంచి పోచమ్మ తల్లి మందిరం వరకు బాజా భజంత్రీలతో, కోలాటాలతో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.