
Collector Sandeep Kumar Jha
మహాలక్ష్మి (మెప్మా) ద్వారా ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటు
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్దూర్ లో మహాలక్ష్మి గ్రామైక్య మహిళా సమైక్య (మెప్మా) ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తనాల దుకాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కొరకు ఎరువులు మరియు విత్తనాల దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సంఘాల అభివృద్ధి కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే.మహేందర్ రెడ్డి ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి మహిళలకు అండగా ఉంటూ నిరుపేద కుటుంబాలను ధనవంతులను చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రత్యేకంగా పేదలకు రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత రవాణా సదుపాయం మహిళలకు అలాగే ఎరువులు విత్తనాలు దుకాణం పెద్దూరు ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆఫజల్ బేగం, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వరూప రెడ్డి మహిళా సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు రైతులు తదితరులు రావడం జరిగింది.